Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Friday, July 29, 2005

కుమారసంభవం 1-20 అసూత సా నాగవధూపభోగ్యం

అసూత సా నాగవధూపభోగ్యం
మైనాక మంభోనిధిబద్ధసఖ్యం
క్రుద్ధేపి పక్షచ్ఛిది వృత్రశత్రా
వవేదనాజ్ఞం కులిశక్షతానామ్

నాగకన్యలకు వరుడు, సముద్రునికి బద్ధమిత్రుడు, పర్వతాల రెక్కలు తెగకోయడానికి ఇంద్రుడు కోపంతో ప్రయోగించిన వజ్రాయుధాన్ని కూడా తప్పించుకున్నవాడు ఐన మైనాకుడిని ఆ మేనాదేవి కన్నది.

కుమారసంభవం 1-19 కాలక్రమే ణాథ తయోఃప్రవృత్తే

కాలక్రమే ణాథ తయోఃప్రవృత్తే
స్వరూపయోగ్యే సురతప్రసంగే
మనోరమం యౌవన ముద్వహన్త్యా
గర్భోభవత్ భూధర రాజపత్న్యాః

కాలక్రమాన, ఆ దంపతులకి స్వరూపయోగ్యమైన సురతప్రసంగం జరగగా, మనోహరమైన యౌవనంలో ఉన్న ఆ పర్వతరాజపత్ని గర్భందాల్చింది.

Thursday, July 21, 2005

"in" versus "లో"

నా colleague ఒకతనికి ఇంతకు ముందు Professor of Linguistics గా experience ఉంది. మొన్న ఒక remarkable విషయం గురించి చెప్పాడు. "In" అంటే తెలుగులో "లో" కదా? కానీ English లో "in" లాంటి prepositions వాడడానికీ తెలుగులో "లో" లాంటి విభక్తులు వాడడానికీ తేడా ఉంది.

మీ ఇల్లు ఎక్కడ? అంటే మనమైతే ఏమని చెప్తాం?

"తిరుపతిలో రైల్వేకాలనీలో శ్మశానం పక్కన" - ఇలాంటిదేదో అంటాం.

English లో ఐతే?

"Beside a cemetery in the Railway Colony in Tirupati"

తేడా కనపడుతోందా? మన విభక్తులవల్ల (postpositions) మనం top-down వెళితే English prepositions వల్ల వాళ్లు bottom-up వస్తున్నారు. తెలుగును SOV (Subject (నేను) Object (అతన్ని) Verb (పిలిచాను) ) భాష అంటారు. English is an SVO (I(S) called(V) him(O)) language. భాషల్లో ఇంత basic difference ఎందుకొస్తుందో తెలుసుకోవాలి. ఈ చిన్న తేడా వల్ల high level references top-down నుంచి bottom-up గా తారుమారయ్యాయి. అందువల్ల cultures లో thinking లో తప్పనిసరిగా తేడాలు రావాలి. Programming ని Assembly language లో మొదలుపెట్టిన వాడికీ, Java తో మొదలుపెట్టిన వాడికీ outlook లో తేడాలుంటాయి కదా. ఆలోచించటం కోసం మనకు తెలియకుండానే మన భాష పైన పూర్తిగా depend అయిపోతాం కాబట్టి, SVO language (bottom-up) mother tongue అవడంవల్ల details గురించి subconscious గా ఆలోచించటం, SVO (top-down) mother tongue ఐతే big picture easy గా చూడగలగటం లాంటి implications ఉంటాయా అన్నది చూడాలి. English medium schools లో చదవటం వల్ల రెండు రకాల భాషలూ వస్తాయిగానీ, మనం రెండిట్లోని advantages పొందుతామా లేక రెండురకాల ఆలోచనల విధానాలూ సరిగ్గా నేర్చుకోలేకపోతామా?

సహజంగా evolution లో జరిగేటట్లే జనాలు SVO, SOV మాత్రమే కాకుండా మిగిలిన నాలుగిటినీ కూడా try చేసిపెట్టారు.

Wikipedia article లో కింది list mention చేశారు (most common to rarest):

Subject Object Verb (SOV) Sam oranges eats. (for example Japanese, Korean, Persian, Latin)
Subject Verb Object (SVO) Sam eats oranges. (for example English, German, Kiswahili, Chinese)
Verb Subject Object (VSO) Eats Sam oranges. (for example Welsh, Hawaiian and Arabic)
Verb Object Subject (VOS) Eats oranges Sam. (for example Fijian)
Object Verb Subject (OVS) Oranges eats Sam. (for example Hixkaryana, or the artificial language Klingon)
Object Subject Verb (OSV) Oranges Sam eats. (for example Yoda's unusual dialect of Basic)

Many languages use more than one mode and some are free-form. Continuing the Java, Assembly language metaphor, I hope తెలుగు is more similar to C or C++, so we get the best of both worlds!

Computer Science నేర్చుకునేవాళ్లకి Pascal, Scheme లాంటివి ముందు చెప్తారు చాలా చోట్ల, programming బాగా వస్తుందని. అలాగే thinking బాగా వచ్చేందుకు మామూలు భాషల్లో కూడా అలాంటి ideal beginner's language ఉండొచ్చా?

Saturday, July 16, 2005

కొడవటిగంటి, అనామిక - "మరవరాని మాటలు" - పుస్తకం

కుమారసంభవం 1-18 స మానసీం మేరుసఖః పిత్రూణాం

స మానసీం మేరుసఖః పిత్రూణాం
కన్యాం కులస్య స్థితయే స్థితిజ్ఞః
మేనాం మునీనా మపి మాననీయా
మాత్మానురూపాం విధి నోపయేమే

మేరుపర్వతానికి స్నేహితుడు, స్థితిజ్ఞుడు ఐన ఆ హిమవంతుడు, పితృదేవతల మనస్సంకల్పఫలితంగా పుట్టినది, మునులకు కూడా మాననీయురాలు, తనకు సమానురాలు ఐన మేనాదేవిని శాస్త్రప్రకారం పెళ్లిచేసుకున్నాడు.

(పితృ కి దీర్ఘం పిత్రూ అని రాయాల్సొచ్చింది)

కుమారసంభవం 1-17 యజ్ఞాంగయోనిత్వ మవేక్ష్య యస్య

యజ్ఞాంగయోనిత్వ మవేక్ష్య యస్య
సారం ధరిత్రీధరణక్షమం చ
ప్రజాపతిః కల్పితయజ్ఞభాగం
శైలాధిపత్యం స్వయ మన్వతిష్ఠత్

హిమాలయాలు యజ్ఞాలకి సంబంధించిన వస్తువులు దొరికే స్థలమవటాన్నీ,
ఆ హిమవంతునికి భూమిని ధరించగలిగే సామర్థ్యం ఉండటాన్నీ తెలుసుకొని బ్రహ్మ స్వయంగా
అతనికి యజ్ఞభాగం కలిగిన శైలాధిపత్యాన్ని అనుగ్రహించాడు.

Thursday, July 14, 2005

ఆత్రేయ, చావకూడదు - "మరవరాని మాటలు" - నైతిక జీవనం

కుమారసంభవం 1-16 సప్తర్షి హస్తావచితావశేషాన్

సప్తర్షిహస్తావచితావశేషాన్
అధో వివస్వాన్ పరివర్తమానః
పద్మాని య స్యాగ్రసరోరుహాణి
ప్రబోధయ త్యూర్ధ్వముఖైర్మయూఖైః

హిమవంతుని పైభాగాల్లో ఉన్న సరస్సుల్లో, సప్తర్షులు తీసుకోగా మిగిలిన పద్మాల్ని (ఆ మండలానికి) కింద తిరిగే సూర్యుడు, తన కిరణాల్లో పైకి వెళ్లేవాటితో వికసింపజేస్తాడు.

(హిమాలయాలు, సప్తర్షిమండలం సూర్యమండలానికన్నా పైన ఉంటాయని ఇన్ఫరెన్స్)

కుమారసంభవం 1-15 భాగీరథీ నిర్ఝర శీకరాణాం

భాగీరథీ నిర్ఝర శీకరాణాం
వోఢా ముహుః కంపితదేవదారుః
యద్వాయు రన్విష్టమృగైః కిరాతై
రాసేవ్యతే భిన్న శిఖండిబర్హః

ఆ హిమాలయాల్లో గంగాప్రవాహం వల్ల ఏర్పడే నీటితుంపరలను మోస్తూ, మాటిమాటికీ దేవదారువృక్షాలను కదిలిస్తూ వచ్చే గాలిని, తమ నెమలికుంచెలను విప్పి, జంతువులని వేటాడే కిరాతులు అనుభవిస్తారు.

Wednesday, July 13, 2005

మహీధర రామమోహనరావు, ఓనమాలు - "మరవరాని మాటలు" - నిద్ర

కుమారసంభవం 1-14 యత్రాంశుకాక్షేపవిలజ్జితానాం

యత్రాంశుకాక్షేపవిలజ్జితానాం
యదృచ్ఛయా కింపురుషాంగనానాం
దరీగృహద్వారవిలంబిబింబాః
తిరస్కరిణ్యో జలదా భవంతి

ఆ హిమాలయాల్లో, "వస్త్రాపహరణం" జరగడంవల్ల సిగ్గుపడుతున్న కింపురుషాంగనలకు యాదృచ్ఛికంగా గుహలద్వారాల ముందుకు వచ్చి వేలాడే మబ్బులు అడ్డుతెరలుగా పనికొస్తాయి.

కుమారసంభవం 1-13 లాంగూల విక్షేప విసర్పిశోభైః

లాంగూలవిక్షేప విసర్పిశోభైః
ఇత స్తత శ్చంద్రమరీచిగౌరైః
య స్యార్థయుక్తం గిరిరాజశబ్దం
కుర్వంతి వాలవ్యజనై శ్చమర్యః

అక్కడి చమరీమృగాలు (yaks) చంద్రుడి కిరణాల్లాంటి తెల్లని వెంట్రుకలుండే వాటి తోకలను అటూ, ఇటూ ఆడించటంచేత హిమవంతుడికి గిరిరాజు అనే పేరును సార్థకం చేస్తున్నాయి.

(చమరీమృగాల తోకలని రాజులూ వగైరాలకోసం (ఛత్ర)చామరాలుగా వాడేవాళ్లట.)

Monday, July 11, 2005

వేమన - "మరవరాని మాటలు" - నమ్మకం

కుమారసంభవం 1-12 దివాకరాద్రక్షతి యో గుహాసు

దివాకరా ద్రక్షతి యో గుహాసు
లీనం దివా భీత మి వాంధకారం
క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే
మమత్వ ముచ్చైశ్శిరసాం స తీవ

పగటికి భయపడి (దివాభీతమివ - గుడ్లగూబలాగా)గుహల్లో దాక్కున్న చీకటిని, సూర్యుడినుంచి ఆ హిమవంతుడు రక్షిస్తున్నాడు. శరణువేడింది చెడ్డవారైనా, మంచివారిని ఆదరించినట్లే ఆదరిస్తారు గొప్పవారు.

Thursday, July 07, 2005

కుమారసంభవం 1-11 ఉద్వేజయ త్యంగుళి పార్ష్ణిభాగాన్

ఉద్వేజయ త్యంగుళిపార్ష్ణిభాగాన్
మార్గే శిలీభూతహిమే పి యత్ర
న దుర్వహశ్రోణిపయోధరార్తాః
భిందంతి మందాం గతి మశ్వముఖ్యః

అక్కడి మంచువల్ల తమ కాలివేళ్లకి, మడమలకి బాధకలుగుతున్నా, దుర్వహశ్రోణిపయోధరార్తులైన కిన్నరస్త్రీలు వారి మెల్లని నడక మాత్రం మానరు.

(కొన్ని కవిప్రయోగాలని తెలుగు చేయటం లేదు. వాడుక తెలుగులో రాస్తే అతకదేమోనని. ఆసక్తి ఉన్నవాళ్లు మూలంలో చదువుకోవచ్చు.)

Wednesday, July 06, 2005

బలివాడ కాంతారావు, అంతరాత్మ కథలు - "మరవరాని మాటలు" - తృష్ణ

కుమారసంభవం 1-10 వనేచరాణాం వనితాసఖానాం

వనేచరాణాం వనితాసఖానాం
దరీగృహోత్సంగ నిషక్తభాసః
భవంతియ త్రౌషధయో రజన్యా
మతైలపూరా స్సురతప్రదీపాః

అక్కడ రాత్రిపూట, వనితాసఖులైన కిరాతులకు ఇళ్లైన గుహల లోపల, ఓషధుల లతలు వెలుగుతూ, నూనె అవసరం లేని దీపాల్లా ఉపయోగపడతాయి.

(మన జగదేకవీరుడు - అతిలోకసుందరి లో, ఇలాంటివి చదివేనేమో, వెలిగే లతల కోసం చిరంజీవి హిమాలయాలకి వెళ్లినట్లు రాశారు.)

Friday, July 01, 2005

శ్రీ నాథుడు, పలనాటి వీరచరిత్ర - "మరవరాని మాటలు" - జన్మఫలం

చిలకమర్తి, గణపతి - "మరవరాని మాటలు" - చదువు

కుమారసంభవం 1-9 కపోలకండూః కరిభి ర్వినేతుం

కపోలకండూః కరిభి ర్వినేతుం
విఘట్టితానాం సరళద్రుమాణాం
యత్ర స్రుతక్షీరతయా ప్రసూతః
సానూని గంధ స్సురభీకరోతి

హిమాలయాల్లోని ఏనుగులు, తమ చెక్కిళ్ల దురద తీర్చుకోవడానికి దేవదారువృక్షాలకి వాటిని రాపాడించినప్పుడు, ఆ వృక్షాలనుండి కారే పాలు హిమాలయపర్వతసానువులని సుగంధభరితం చేస్తాయి.

కుమారసంభవం 1-8 యః పూరయన్ కీచకరంధ్రభాగాన్

యః పూరయన్ కీచకరంధ్రభాగాన్
దరీముఖోత్థేన సమీరణేన
ఉద్గాస్యతా మిచ్ఛతి కిన్నరాణాం
తానప్రదాయిత్వ మి వోపగంతుమ్

అక్కడి గుహలనుండి వెలువడే గాలి, వెదుళ్లని నింపడం వల్ల వచ్చే శబ్దాలు, హిమవంతుడు కిన్నరుల గానానికి తానమిద్దామనుకుంటున్నాడా అనిపించేలా చేస్తాయి.