Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Monday, August 08, 2005

కాకతీయ యుగము - ముందుమాట

"మరవరాని మాటలు" తర్వాతి పుస్తకం "కాకతీయ యుగము". ఇది online దొరుకుతుంది. Digital Library of India లో tif files డౌన్ లోడ్ చేసి చదవొచ్చు.

ఇది ప్రపంచ తెలుగు మహాసభ వారి ప్రచురణ. ప్రథమ ముద్రణ 1975 లో.
రచయిత ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు.
కాపీ రైట్ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి వారిది. కానీ online పెట్టేశారు కాబట్టి బాగానే కాపీ కొట్టొచ్చనుకుంటా. అప్పటి వెల రెండున్నర రూపాయలు.

ముందుమాట రాసినవారు అప్పటి మన ముఖ్యమంత్రి (1973-1978) జలగం వెంగళరావుగారు. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల అధ్యక్షులు కూడా ఆయనే. ఆ సభలు April 12, 1975 తెలుగు ఉగాది రోజున మొదలై ఒక వారం పాటు జరిగాయట. ఎక్కడ జరిగాయో రాయలేదు. హైదరాబాదులోనేమో. వెంగళరావుగారు "తెలుగు ప్రజలు, భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన వివిధ రంగాలలో సాధించిన ఘనవిజయాలను విశదం చేసే గ్రంథాలు అనేకం ఈ మహాసభల సమయంలో విడుదల అవుతాయి" అని రాశారు ముందుమాటలో. ఆ మిగిలినవి కూడా దొరికితే బాగుణ్ను.

0 Comments:

Post a Comment

<< Home