Google Groups Subscribe to andhramahabharatam.
Visit andhramahabharatam.blogspot.com
Email:
Browse Archives at groups.google.com

Sunday, August 07, 2005

Microsoft Office Telugu LIP and వాడుక తెలుగు

ఈ మధ్య Microsoft Office 2003 Telugu LIP (Language Interface Pack) కనబడింది. ఈ ప్రయత్నం చేసినందుకు Microsoft ని మనస్పూర్తిగా మెచ్చుకోవాలి. ఆసక్తి ఉన్నవారు డౌన్ లోడ్ చేసి, వాడి చూడండి.

కానీ, తెలుగులోగానీ, ఏ భాషలోగానీ Localization అంటే Application లో ఉన్న ప్రతి ఇంగ్లీషుపదాన్నీ dictionary లోంచి squeeze చేసి వచ్చినదాన్ని వాడడమని ఎందుకనుకుంటారో?

"నిక్షిప్తం రీతి, స్థాపకవ్యవస్థ, పూర్వవీక్షణ, పునరుక్తి, విధి ఫలకం, స్వయంపాఠం, అనుకూలీకృతం" - ఇవన్నీ ఏడో తరగతి తెలుగు పరీక్షలో సంధులో సమాసాలో కాదు. Microsoft Word Telugu LIP లో Menu Items.

ఏమిటీ పదాలు? ఎందుకొచ్చిన గోల? "Save" అనేందుకు నిక్షిప్తం అనాలా? "Layout" అనేందుకు స్థాపకవ్యవస్థ అనాలా?
అవే పదాలు తెలుగులో రాయొచ్చు కదా? గిడుగువారి ఆదర్శాలకి నీళ్లొదులుతూ గ్రాంథికభాషని తెలుగు software లోనూ, కొన్ని తెలుగు వెబ్ సైట్లలోనూ మళ్లీ తలెత్తుకునేలా చేయడం చూస్తే బాధగా ఉంది. తెలుగును రక్షిస్తున్నామనుకుంటూ (అమాయకంగానో, భా౤షాభిమానంతోనో) ఇలా రాయడమే నిజంగా తెలుగుని ఖూనీ చేయడం.

ఇంగ్లీషు పదాలు వాడినంత మాత్రాన భాష బలహీనపడిపోదు. సంస్కృతం onslaught ని తెలుగు సమర్థవంతంగా ఎదిరించలేదూ?
ఆ process లో ఇంకా అందంగా తయారైంది. సూర్యుడికి అచ్చతెలుగు పదమైన 'పొద్దు'ని ఎంతమంది ఆ అర్థంలో వాడుతున్నారు? తెలుగును కాపాడడమంటే "టైమెంత" అనేందుకు కొత్త, పూర్తి తెలుగు మార్గాలు వెతకడం కాదు. గ్రాంథిక తెలుగుభాషలోని కావ్యాల్ని ఎందుకు appreciate చేయలేకపోతున్నాం? పైనున్నవాటి తాతల్లాంటి పదాలవల్లే కదా. వాటితో పరిచయమున్న గొప్ప పండితులు ఆ కావ్యాల్ని వాడుక తెలుగులో రాసి ప్రచురిస్తే ఎంత బాగుంటుంది? బాలల బొమ్మల భారతాలూ, బాలల బొమ్మల రామాయణాలూ ఎందుకున్నాయి? చిన్నపిల్లల భాషలో వాటిని ప్రచురించడం వాల్మీకినీ వ్యాసుడినీ అవమానించడమేమీ కాదే. అవి చదివిన పిల్లలు ఆసక్తితో ఎప్పటికైనా అసలు కావ్యాలు చదివి అర్థంచేసుకోగలిగితే అంతకంటే కావలసిందేమిటి?

పెద్దల హరవిలాసాలూ, పెద్దల మనుచరిత్రా, పెద్దల ఆంధ్రమహాభారతమూ ప్రతిపదార్థ, టీకా, తాత్పర్యాలతో, చవగ్గా, అందరూ చదవగలిగే విధంగా రావాలి.
విధి, అంతరంగాలు వంటి సీరియల్స్ కి ఖర్చుపెట్టగా మిగిలిన డబ్బుతో రామోజీరావుగారో, సూపర్ లాంటి చిత్రరాజాలకి ఖర్చుపెట్టగా మిగిలిన చిల్లరతో అక్కినేని వారో ఇలాంటి initiatives తీసుకోవడం, లేక/"మరియు" విశాలాంధ్ర లాంటి సంస్థలని ప్రోత్సహించడం చేస్తే తెలుగువారంతా ఆనందిస్తారు. తరాలకి తరాలు గుర్తుపెట్టుకుంటాయి.

3 Comments:

Anonymous Anonymous said...

This comment has been removed by a blog administrator.

Sunday, August 07, 2005 4:09:00 PM  
Blogger simplyme said...

chala bagundi post. nijangaane aa kaavyaalani ardhamayye telugu lo ki evaraina anuvadiste janaalu tappakunda chaduvutaaru. mana mahakavyalakante ee john grisham navalalu anta goppavemee kaadu.

Thursday, August 11, 2005 11:36:00 AM  
Blogger Nrahamthulla said...

విద్యార్ధులు తెలుగులో మాట్లాడకూడదట
* కడప జిల్లా మైదుకూరు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో తెలుగుభాష మాట్లాడకూడదంటూ చిన్నారుల మెడలో బోర్డులు తగిలించారు.తెలుగు భాష మా ట్లాడకూడదంటూ విద్యార్థులపై ఆంక్షలు విధించడం మానవ హ క్కుల ఉల్లంఘనకు పాల్పడటమేనని, ఇది ఘోర తప్పిదమని మా నవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టి స్‌ సుభాషణ్‌రెడ్డి వ్యాఖ్యానించా రు. (ఆంధ్రజ్యోతి 28.10.2009)
పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే
పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.
ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్
ఆరు, ఆపై తరగతులు చదివే విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగుకు బదులు ఇంగ్లీష్‌ తీసుకోవడానికి ఇక మీదట జిల్లా విద్యా శాఖాధికారులే (డీఈఓ) అనుమతి ఇవ్వొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ద్వితీయ భాషగా ఇంగ్లీష్‌ను తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టరేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. (ఆంధ్రజ్యోతి1.11.2009)-
తెలుగుపై పరిశోధన.. అమెరికాలోనే ఎక్కువ
మనదేశంలో భాషలపై పరిశోధనలు జరిపే వారే కరవయ్యారని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడితో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువమంది తమిళ, తెలుగు భాషలపై పరిశోధనలు చేస్తున్న వారు కనిపించారని తెలిపారు.(ఈనాడు31.1.2010)
అంతరించిపోతున్నఅమ్మభాష
దాదాపు రెండుతరాల విద్యార్థులు తెలుగు రాకుండానే, తెలుగుభాషను తూతూమంత్రంగా చదువుకునే కళాశాలల నుంచి బైటికొచ్చారు. వాళ్లంతా ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రభుత్వశాఖల్లో పెద్దపెద్ద ఉద్యోగులైపోయారు. తెలుగంటే వెగటు. ఇంట్లో తెలుగక్షరాలు కనపడనీయరు. వినబడనీయరు. ఇక వీరి పిల్లలకు మాత్రం తెలుగంటే ఏం తెలుస్తుంది పాపం! ఇలాగే ఇంకో రెండుతరాలు కొనసాగితే, తెలుగువాచకాన్ని సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఓ పురాతన వస్తువులా ప్రదర్శనకు పెట్టాల్సిందే.పేరుకు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రమైనా, మనదగ్గర తల్లిభాషది రెండో స్థానమే. మళ్లీ మాట్లాడితే, మూడోస్థానమే.యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత కానీ మనం తెలుగుభాషకు అధికార హోదా కల్పించుకోలేకపోయాం. తెలుగుభాషకే మంగళహారతులు పాడేస్తున్నాం.ఇంగ్లిష్‌, రోమన్‌, జర్మన్‌ సహా సంస్కృతం, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం వంటి భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగు భాషకే భావాలను వేగాతివేగంగా అక్షర రూపంలోకి తర్జుమా చేయగల శక్తి ఉందని నిరూపించారు. 'ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది. అదే ఈ వేగానికి కారణం.కంప్యూటరు, మౌజు, కీబోర్డు, హార్డ్‌వేరు, సాఫ్ట్‌వేరు...చివర్లో అచ్చు గుద్దేస్తే చాలు, కాకలుతిరిగిన ఇంగ్లీషు పదమైనా పంచెకట్టులోకి మారిపోతుంది. సాంకేతిక పదజాలాన్ని ఇట్టే ఇముడ్చుకోగల శక్తియుక్తులున్న ఏకైక భాష... భారతీయ భాషలన్నింట్లోకీ ఒక్క తెలుగేనని యాభై ఏళ్ల కిందటే ప్రపంచ ప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హాల్డెన్‌ ప్రశంసించారు.మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే.1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. - కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు 21.2.2010)

Sunday, February 21, 2010 7:10:00 AM  

Post a Comment

<< Home